హైటెక్స్ లో... ప్రయాణం మరియు పర్యాటక ప్రదర్శన ప్రారంభం
హైటెక్ సిటీ సమీపంలోని హైటెక్స్ ప్రాంగణంలో ప్రయాణం మరియు పర్యాటక ప్రదర్శన ప్రారంభమయ్యింది. దేశంలోని అన్ని రాష్ట్రాలూ ‘ట్రావెల్ అండ్ టూరిజం ఫెయిర్’ పేరిట ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, కర్ణాటక, గోవా తదితర రాష్ట్రాలు స్టాళ్లు నెలకొల్పాయి. శ్రీలంక, థాయ్ లాండ్, సింగ్ పూర్ తదితర దేశాల టూరిజం శాఖలు కూడా ఇక్కడ ప్రదర్శనశాలలను ఏర్పాటు చేయడం విశేషం.
మూడు రోజుల పాటు జరుగనున్న ఈ ఫెయిర్ ప్రధానోద్దేశం పర్యాటక రంగానికి ప్రోత్సాహం కల్పించడమేనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. ప్రస్తుతం టూరిజం ద్వారా రూ.130 కోట్ల ఆదాయం వస్తున్నదని ఆయన పేర్కొన్నారు.